జానీ మాస్టర్ కేసులో కోర్టు సంచలన నిర్ణయం
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును వాయిదా వేసింది.
BY Vamshi Kotas24 Sept 2024 4:20 PM IST
X
Vamshi Kotas Updated On: 24 Sept 2024 4:20 PM IST
టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీనిపైన జిల్లా రంగారెడ్డిలో రేపు తీర్పు వెల్లడించనుంది. మరోవైపు జానీ మాస్టర్ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పైన కూడ రేపు విచారణ జరుగనున్నది.
జానీ మాస్టర్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు నిన్న పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మహిళ అసిస్టెంట్ కొరియోగ్రఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ని ఈ నెల 19న పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు నార్సింగి పోలీసులు తీసుకోచ్చారు. 14 రోజులు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Next Story