Telugu Global
Cinema & Entertainment

అదే.. నాన్న చేసిన తప్పు

నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్‌కు గాయాలు కావడం దురదృష్టకరం.. ముఖంపై మైక్‌ పెట్టగానే క్షణికావేశంలో నాన్న దాడి చేశారన్న విష్ణు

అదే.. నాన్న చేసిన తప్పు
X

మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా న్న చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. నిన్న జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడుపు చించుకుటే కాళ్లపై పడుతుందని, కుటుంబం వివాదం గురించి ఏమీ మాట్లడను అని మంచు విష్ణు అన్నారు. చిన్నవాడు అవగాహన లేకుండా మాట్లాడి ఉండవచ్చు గాని నేను మాత్రం అలా మాట్లాడలేను అన్నారు. నేను ఉండి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదన్నారు. ఆస్తులన్నీ నాన్న స్వార్జితం.. వాటిపై హక్కు ఆయనదేనని స్పష్టం చేశారు. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని, కొందరికి చిన్న కుటుంబం అంటే ఇష్టమని విష్ణు తెలిపారు. నా ఇంట్లో ఉండొద్దని నాన్న అంటే ఆమాటకు గౌరవం ఇవ్వాలన్నారు. మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాను. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపెడుతున్నది. ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాను. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్‌ చేయవద్దని కోరారు. ప్రజల్లో మాకు గుర్తింపు ఉన్నది. ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే కానీ, కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అమ్మ అస్పత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నాను. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల కోసం లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్‌ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాను. అన్నికంటే కుటుంబం ముఖ్యం. నిన్న ఉదయాన్నే హైదరాబాద్‌కు వచ్చానని విష్ణు తెలిపారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఊళ్లో లేని నాలుగు రోజుల్లో ఇదంతా జరిగిపోయింది. నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరినీ బాధ పెట్టాలనుకోలేదు. నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకు వచ్చారు. ముఖంపై మైక్‌ పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారు. ఆ రిపోర్టర్‌ కుటుంబంతో నేను ఫోన్‌లో మాట్లాడాను. అవసరమైన సాయం చేస్తామని విష్ణు తెలిపారు.మరోవైపు మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదంపైవిచారణకు రావాలని రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు రాచకొండ సీపీ కార్యాలయానికి మంచు మనోజ్‌ చేరుకున్నారు. విచారణకు తాను కూడా వెళ్తానని మంచు విష్ణు తెలిపారు.

మోహన్‌బాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌

నటుడు మోహన్‌ బాబు మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటెల్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ.. తాజాగా హాస్పిటల్‌ సిబ్బంది ఒక హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నది. మెడికల్‌ టెస్టుల తర్వాత ఆయనకు కంటి కింద భాగంలో గాయమైనట్లు గుర్తించింది. అలాగే బీపీ ఎక్కువగా ఉన్నదని.. గుండె కొట్టుకోవడంలో హెచ్‌తగ్గులు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. ఈ మేరకు సంబంధిత వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నది.

First Published:  11 Dec 2024 1:36 PM IST
Next Story