థాంక్యూ మొదటి రోజు వసూళ్లు
నాగచైతన్య హీరోగా నటించిన సినిమా థాంక్యూ. నిన్న రిలీజైన ఈ సినిమాకు పూర్ ఓపెనింగ్స్ దక్కాయి.
దిల్ రాజు భయపడినంత పని జరిగింది. థాంక్యూ సినిమాకు మొదటి రోజు పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. నిన్న రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం కోటి 65 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. నాగచైతన్య కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్ ఇది.
థాంక్యూ సినిమాపై మొదట్నుంచి బజ్ లేదు. ఈ సినిమా ట్రయిలర్ ఆకట్టుకోలేదు. దీనికితోడు రిలీజ్ కు ముందు విడుదల చేసిన పాటలు హిట్టవ్వలేదు. ఇవన్నీ ఒకెత్తయితే.. ముందుగా ఓ టికెట్ రేటు చెప్పి, తర్వాత పెంచిన టికెట్ రేటు అమలు చేయడంతో ప్రేక్షకులు మొహం చాటేశారు. ఫలితంగా థాంక్యూ తేలిపోయింది.
ఈ సినిమాకు ఇప్పటికే నెగెటివ్ రివ్యూస్ వచ్చేశాయి. సినిమా ఏం బాగాలేదంటూ చాలా సైట్లు రాసేశాయి. దీంతో ఈ సినిమా కోలుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పైగా ఇలాంటి కంటెంట్ చూసేందుకు జనాలు థియేటర్లకు రావడం మానేశారు. కరోనా తర్వాత ప్రేక్షకుల టేస్ట్ పూర్తిగా మారిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 20 కోట్ల రూపాయలకు అమ్మారు. నైజాంలో దిల్ రాజు సొంత రిలీజ్ కాబట్టి, ప్రస్తుత మార్కెట్ రేట్లు బట్టి 8 కోట్లు అంచనాతో ఈ ప్రీ-రిలీజ్ బిజినెస్ ను ట్రేడ్ లెక్కగట్టింది. మొదటి రోజు వసూళ్లతో చూసుకుంటే, ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవు.
ఏపీ,నైజాంలో థాంక్యూ సినిమాకు తొలి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం - 72 లక్షలు
సీడెడ్ - 20 లక్షలు
ఉత్తరాంధ్ర - 22 లక్షలు
ఈస్ట్ - 14 లక్షలు
వెస్ట్ - 8 లక్షలు
గుంటూరు - 10 లక్షలు
కృష్ణా - 12 లక్షలు
నెల్లూరు - 7 లక్షలు