Telugu Global
Cinema & Entertainment

'తండేల్‌' మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

విదేశాల్లో అదరగొడుతున్న ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌

తండేల్‌ మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
X

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తండేల్‌' పాటలు, డైలాగులతో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్‌ టాక్‌ను సొంతం చేసుకొని మంచి వసూళ్లన తన ఖాతాలో వేసుకుంటున్నది. ఓవర్సిస్‌ బాక్సాఫీస్‌ వద్ద మొదటిరోజు భారీ కలెక్షన్లు రాబట్టింది. విదేశాల్లో మొదటిరోజు ఈ సినిఆమ 3 లక్షల 50 వేల డాలర్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ పంచుకున్నది. అలలు మరింత బలపడుతున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ను పంచుకున్నది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అని క్యాప్షన్‌ పెట్టింది. దీంతో త్వరలోనే 50 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటుతుందని అభిమానులు అంటున్నారు.

బుక్‌ మై షోలో 24 గంటల్లో సమారు 2 లక్షలకు పైగా 'తండేల్‌' టికెట్స్‌ అమ్ముడయ్యాయి. అలాగే ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు సంస్థ తెలిపింది. చందూ మొండేటి డైరెక్షన్‌లో నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి జీవించారు. వీరి మధ్య హృద్యమైన ప్రేమను ముడిపెడుతూ, దానికి సినిమాటిక్‌ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకిత్తించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ, ఆ ఇద్దరి నటన, విజువల్స్‌, సంగీతం కలిసి మూవీని మరోస్థాయి తీసుకెళ్లాయి. దీంతో మంచి వసూళ్లను సొంతం చేసుకుంటున్నది.

First Published:  8 Feb 2025 9:36 AM IST
Next Story