BRO Movie | పాటలపై క్లారిటీ ఇచ్చిన తమన్
Thaman BRO movie - బ్రో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు తమన్. ఇందులో ఎన్ని పాటలుంటాయి, అవి ఎలా ఉండబోతున్నాయో స్పష్టతనిచ్చాడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది బ్రో సినిమా. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో మాస్ సాంగ్స్ ఉండవంటున్నాడు సంగీత దర్శకుడు తమన్. బ్రో సినిమాలో పాటలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
"బ్రో లో పాటల్ని మాస్ గా చేయలేము. సామెతలు లాగానే చెప్పాలి. ప్రత్యేక గీతాలు లాంటివి స్వరపరచలేము. ఇది అలాంటి సినిమా కాదు. కొన్ని పరిధులు ఉన్నాయి. కాలం ఎంత ముఖ్యం అనే దానిపై ఒక ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నాం. త్వరలో తేజ్ డ్యూయట్ ఒకటి రిలీజ్ అవుతుంది. అలాగే శ్లోకాలను అన్నింటినీ కలిపి ఒక పాటలా విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా క్లైమాక్స్ లో ఒక మాంటేజ్ సాంగ్ కి సన్నాహాలు చేస్తున్నాం. మొత్తం 4 పాటలు ఉంటాయి."
ఇలా బ్రో సినిమా పాటలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సంగీత దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారంటున్న తమన్.. మూవీలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని చెబుతున్నాడు.
పవన్ తనను ఎన్నో సందర్భాల్లో మెచ్చుకున్నారని, ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం అంటున్నాడు తమన్. 'గుడుంబా శంకర్' సమయంలోనే మణిశర్మ అసిస్టెంట్ గా పవన్ తో కలిసి పనిచేశాడట ఈ మ్యూజిక్ డైరక్టర్. సంగీతం విషయంలో పవన్ కల్యాణ్ కు చాలా నాలెడ్జ్ ఉందంటున్న తమన్.. పవన్ తో పాట పాడించేంత సాహసం మాత్రం చేయనంటున్నాడు.