Telugu Global
Cinema & Entertainment

People Media Factory | తగ్గేదేలే అంటున్న నిర్మాత

People Media Factory - పేరుకు తగ్గట్టే ఈ బ్యానర్ ఫ్యాక్టరీలా పనిచేస్తోంది. ఏడాదికి కనీసం 10 సినిమాలకు తగ్గకుండా నిర్మిస్తోంది.

People Media Factory | తగ్గేదేలే అంటున్న నిర్మాత
X

వంద సినిమాలు తీయడనే లక్ష్యంగా బరిలోకి దిగింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. అలా అని చుట్టేసే సినిమాలు తీయడం లేదు ఈ బ్యానర్. హీరో, కథకు తగ్గట్టు బడ్జెట్ కేటాయిస్తూ... క్వాలిటీ సినిమాలు నిర్మిస్తోంది.

అయితే రీసెంట్ గా సినిమా మార్కెట్ కండిషన్స్ మారాయి. దీంతో చాలా బ్యానర్లు స్లో అయ్యాయి. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంగతేంటి.. ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.

"ఇప్పుడు మా నుంచి 15 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వచ్చే ఏడాది కూడా మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దాదాపు 10 సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. అలా రాబోయే 2-3 ఏళ్లలో కనీసం 30 సినిమాలొస్తాయి."

ఏడాదికి కనీసం 10 సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని.. ప్రభాస్ లాంటి హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే, మీడియం రేంజ్ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తామన్నారు.

"గూఢచారి-2, మిరాయ్, రాజా సాబ్, సన్నీడియోల్ తో హిందీ మూవీ జరుగుతున్నాయి. కన్నడలో గణేష్ అనే యాక్టర్ తో 50 కోట్ల స్పాన్ ఉన్న మూవీ చేస్తున్నాం. ఇంకో 3 కన్నడ సినిమాలున్నాయి. తెలుగులో నాలుగైదు సినిమాలున్నాయి. విశ్వక్ సేన్, అనుదీప్ మూవీ, దీంతో పాటు ఈ ఏడాది మొదలయ్యే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా యూఎస్ లో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం."

ఇలా ఈ రాబోయే ఏడాది ప్రాజెక్టులు వెల్లడించారు విశ్వప్రసాద్. వీటిలో విశ్వం, శ్వాగ్ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయని.. ఇవి కాకుండా ఓటీటీ కోసం ఓ 5 సినిమాలు రెడీగా ఉన్నాయని స్పష్టం చేశారు.

First Published:  10 Aug 2024 4:09 PM GMT
Next Story