Telugu Global
Cinema & Entertainment

నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కోరిన గాయని కల్పన

నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు
X

తన భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవని.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని గాయని కల్పన కోరారు. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న తర్వాత ఆమె ఓ వీడియోలు విడుదల చేశారు.మీడియాలో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతున్నది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. 'నేను నా భర్త, కుమార్తె సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 సంవత్సరాల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నాను. అతనితో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోయంగా ఉన్నది. వృత్తిపరంగా ఒత్తిడి ఎక్కువై నిద్ర పట్టడం లేదు. అందుకు చికిత్స తీసుకుంటున్నాను. ట్యాబ్లెట్స్‌ ఓవర్‌ డోస్‌ తీసుకోవడంతో స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో స్పందించారు. కాలనీవాసులు, పోలీసుల సహాయంతో మీ ముందున్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మమ్మల్ని అలరిస్తాను. ఆయన సహకారం వల్లనే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. నా జీవితానికి బెస్ట్‌ గిఫ్ట్‌ నా భర్త. నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

First Published:  7 March 2025 10:28 AM IST
Next Story