Dasara Movie: నాని సినిమా కోసం భారీ విలేజ్ సెట్
Nani's Dasara Movie: నాని హీరోగా నటించిన దసరా మూవీ కోసం పెద్ద గ్రామం సెట్ వేశారు. ఏకంగా 22 ఎకరాల సువిశాల స్థలంలో ఈ సెట్ వేశారు.
సింగరేణి బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో, తెలంగాణ నేపథ్యంలో సాగింది దసరా సినిమా. ఈ సినిమా కోసం సింగరేణి ప్రాంతంలో కొంత షూట్ చేసినప్పటికీ, మేజర్ పార్ట్ షూటింగ్ మాత్రం ఓ సెట్ లో వేశారు. దీని కోసం ఓ భారీ విలేజ్ సెట్ ను వేశారు. ఆ సెట్ ను ఆర్ట్ డైరక్టర్ అవినాష్ కొల్లా నిర్మించాడు.
దసరా సినిమా కోసం 22 ఎకరాల్లో భారీ గ్రామం సెట్ వేశామని ప్రకటించాడు ఆర్ట్ డైరక్టర్ అవినాష్. సినిమాకు సంబంధించి 98శాతం షూటింగ్ సెట్ లోనే జరిగిందని, దాదాపు వంద రోజుల పాటు ఈ సెట్ ను ఉపయోగించామని తెలిపాడు.
"ఊరు సెట్ అనగానే బేసిగ్గా ఈస్ట్ వెస్ట్ ఆంధ్ర రిఫరెన్స్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ థిన్ లైన్ ఉంది. ఇంటిపై వేసే పెంకులో కూడా ఆంధ్రకి తెలంగాణకి తేడా ఉంటుంది. అవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం. వర్కింగ్ డేస్ ఎక్కువ కాబట్టి సిమెంట్ స్టోన్స్ విండోలు తలుపులు ఏవీ డమ్మి లేకుండా నేచురల్ గా కలెక్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. మైనింగ్ కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎలాంటి వాతావరణం వుంటుందో అదే వాతావరణాన్ని చాలా సహజంగా క్రియేట్ చేశాం. ఇందులో ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. అందులో ఒకొక్క దర్వాజనే మూడు లక్షలు పెట్టి కొన్నాం. చాలా ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఉంటాయి."
ఇలా దసరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు ఆర్ట్ డైరక్టర్ అవినాష్ కొల్లా. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. నాని-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు.