కమిట్ మెంట్ గురించి బయటపెట్టిన తేజశ్వి
కమిట్ మెంట్ అనే సినిమాలో నటించింది తేజశ్వి. చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది.
దాదాపు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది కమిట్ మెంట్ అనే సినిమా. ఇండస్ట్రీలో చీకటి కోణాల్ని బయటపెట్టే కథతో ఈ సినిమా తెరకెక్కింది. తేజశ్వి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా 19వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా తనకు నిజజీవితంలో ఎదురైన కొన్ని ఘటనల్ని బయటపెట్టింది తేజశ్వి.
"నన్ను కమిట్ మెంట్ అడగాలంటే చాలామంది భయపడేవారు. ఎందుకంటే నేను అంత బోల్డ్ గా, స్ట్రాంగ్ గా ఉంటాను. ఇప్పటివరకు ఎవరూ నన్ను కమిట్ మెంట్ అడగలేదు. అందరూ నాతో కూల్ గానే ఉన్నారు. ఓ డైరక్టర్ మనల్ని కమిట్ మెంట్ అడిగితే ఫుల్ గా పెర్ఫార్మెన్స్ రాదు. నన్ను కమిట్ మెంట్ అడగలేదు కాబట్టే, అన్ని సినిమాల్లో చక్కగా చేశాను."
ఇండస్ట్రీని బదనాం చేసేందుకు ఈ సినిమా చేయలేదంటోంది తేజశ్వి. తనకు అన్నం పెట్టిన, క్రేజ్ ఇచ్చిన ఇండస్ట్రీని కాలదన్నుకునే రకం కాదని స్పష్టం చేసింది. కేవలం ఇండస్ట్రీలో ఉన్న ఓ చీకటి కోణాన్ని పాజిటివ్ కోణంలో, సహజాత్మకంగా చూపించామని చెబుతోంది.
ఈ సినిమాలో తేజశ్వి పాత్ర పేరు శ్రీరెడ్డి. ఈ పాత్రను శ్రీరెడ్డిని టార్గెట్ చేసి డిజైన్ చేయలేదని, అక్కడక్కడ కొన్ని యదార్థ ఘటనల్లా అనిపించినప్పటికీ, వాటికి తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది తేజశ్వి.