Ustad BhagatSingh - పవన్ సినిమాపై తేజ నమ్మకం
Teja Ustad BhagatSingh - ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు దర్శకుడు తేజ. అందులో పవన్ మేనరిజమ్స్ అతడికి నచ్చాయంట.

ఊహించని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కు మరో దర్శకుడి ప్రోత్సాహం దక్కింది. అతడే దర్శకుడు తేజ. సీనియర్ దర్శకుల్లో ఒకరైన తేజ, పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు, అహింస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. 2వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా ప్రచారంలో, పవన్ కల్యాణ్ కు సంబంధించి ఓ ప్రశ్న తేజకు ఎదురైంది. పవన్ కు ఎలాంటి సినిమాలైతే బాగుంటుందనేది ఆ ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రస్తావించాడు తేజ. తాజాగా రిలీజైన ఆ సినిమా గ్లింప్స్ చూశానని, అందులో పవన్ మేనరిజమ్స్ బాగున్నాయని, అతడికి ఉస్తాద్ లాంటి సినిమాలు బాగుంటాయని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశాడు.
తేజ స్టేట్ మెంట్ తో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ స్టేట్ మెంట్ పై దర్శకుడు హరీశ్ శంకర్ కూడా స్పందించాడు. తను తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు మద్దతు తెలిపిన తేజకు ధన్యవాదాలు తెలిపాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.