Telugu Global
Cinema & Entertainment

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా వరుడు ఎవరో తెలిస్తే షాక్ ?

తమన్నాభాటియా, విజయ్ వర్మ పెళ్లికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ జంట 2025లో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా వరుడు ఎవరో తెలిస్తే షాక్ ?
X

తమన్నాభాటియా, విజయ్ వర్మ పెళ్లికి రెడీ అవుతున్నరని బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. ముంబైలో కలిసి ఉండటానికి వీరు ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కోసం ఇప్పట్టి నుంచే సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలోనే వివాహం ఉంటుందని సమాచారం 2023 సంవత్సరంలో లస్ట్ స్టోరీస్ 2 విడుదల సమయంలో ఈ జంట తమ రిలేషన్‌ను ఒప్పుకున్నారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఇప్పటిదాకా మ్యారేజ్ గురించి ప్రస్తావనే లేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ ప్రేమాయణం గురించి ప్రకటించినప్పటి నుంచి పెళ్లి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఆ మధ్య పెళ్లి గురించి విజయ్ వర్మ కౌంటర్ ఇవ్వడంతో ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు వినిపించలేదు.ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం వరుస మావీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. తమన్నా వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.

First Published:  23 Nov 2024 6:34 PM IST
Next Story