Telugu Global
Cinema & Entertainment

యాక్ష‌న్ మోడ్ లో మిల్కి బ్యూటీ.. ఇక ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ట్రీటే

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్ షోకు, మూడు నాలుగు లవ్ సీన్ల‌కు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు హీరోలతో సమానంగా యాక్షన్ పాత్రల్లో చెలరేగిపోతున్నారు. ఈ జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది.

యాక్ష‌న్ మోడ్ లో మిల్కి బ్యూటీ.. ఇక ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ట్రీటే
X

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్ షోకు, మూడు నాలుగు లవ్ సీన్ల‌కు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు హీరోలతో సమానంగా యాక్షన్ పాత్రల్లో చెలరేగిపోతున్నారు. ఈ జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఓదెల 2 ఒకటి. 2021లో విడుద‌లై సూప‌ర్ హిట్ గా నిలిచిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా డైరెక్ట‌ర్‌ సంపత్ నంది ఓదెల 2ను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నాడు.

అశోక్ తేజ డైరెక్ట‌ర్ కాగా.. త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. అలాగే హెబ్బా పటేల్, వశిష్ట ఎన్.సింహ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సూప‌ర్‌ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవ‌డంతో పాటు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక‌పోతే ఓదెల 2 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఓ భారీ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తాజా షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారు. టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ట్రీట్ లా ఉండ‌బోతున్నాయ‌ట‌. అలాగే ఈ యాక్ష‌న్ పార్ట్ కోసం త‌మ‌న్నా ప్రత్యేక శిక్షణ తీసుకుంద‌ని.. ఆమెలోని ఇంటెన్స్‌ యాక్షన్‌ కోణాన్ని ఓదెల 2లో ఆవిష్కరించ‌బోతున్నామ‌ని డైరెక్ట‌ర్ అశోక్ తేజ చెబుతున్నాడు.

మ‌రి ఫుల్ యాక్ష‌న్ మోడ్ లో ఉన్న మిల్కి బ్యూటీ.. ఆన్ స్క్రీన్ పై ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో చూడాలి. కాగా, మధు క్రియేషన్స్ మ‌రియు సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ల‌పై ఓదెల 2 మూవీ నిర్మితమ‌వుతోంది. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  29 Jun 2024 5:47 AM GMT
Next Story