Hari Hara Veera Mallu: పవన్ టీజర్ పై అదే ఉత్కంఠ
Hari Hara Veera Mallu Teaser release date: రిపబ్లిక్ డే కానుకగా హరిహర వీరమల్లు సినిమా నుంచి టీజర్ వస్తుందంటున్నారు. ఇంతకీ ఆ టైమ్ కు టీజర్ వస్తుందా?

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఏదైనా సినిమా నుంచి అప్ డేట్ వస్తుందంటే, ఆ హంగామా వారం రోజుల ముందు నుంచే ఉంటుంది. ఫ్యాన్స్ అంతా ఎవరికివారు కౌంట్ డౌన్ షురూ చేస్తారు. మరికొంతమంది అత్యుత్సాహంతో స్క్రీన్ షాట్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు. చాలామంది ట్రెండింగ్స్ షురూ చేస్తుంటారు.
అయితే ఈ హంగామా ఏదీ ఇప్పుడు కనిపించడం లేదు. పవన్ సినిమాకు ఏమైంది? అప్ డేట్ ఎందుకు రావడం లేదు?
క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఏఎం రత్నం నిర్మాత. ఈ సినిమా టీజర్ ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఆ హంగామాకు ఇంకా 3 రోజులు మాత్రమే టైమ్ ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా టీజర్ పై ఎలాంటి అప్ డేట్ లేదు.
అసలు చెప్పిన టైమ్ కు టీజర్ వస్తుందా రాదా అనే అనుమానం ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో మొదలైంది. అందుకే అంతా గప్ చుప్ అయ్యారు. ఎలాంటి చడీచప్పుడు చేయడం లేదు. హరిహర వీరమల్లు సినిమా నుంచి టీజర్ అప్ డేట్ వస్తుందా రాదా అనే విషయం మరో 24 గంటల్లో తేలిపోతుంది.