Kanguva Movie Trailer: సూర్య సినిమా ట్రయిలర్ రెడీ
Kanguva Movie Trailer: సూర్య నటిస్తున్న పీరియాడిక్ మూవీ కంగువ. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది.

Kanguva Movie Trailer
Kanguva Movie Trailer: స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఇదొక పీరియాడిక్ యాక్షన్ మూవీ. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. దర్శకుడు శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నాడు.
కంగువ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాయి. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రెడీ చేశారు. 12వ తేదీన కంగువ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘కంగువ’ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరగనున్నాయి.
పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది కంగువ. 10 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను త్రీడీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.