Telugu Global
Cinema & Entertainment

Kanguva - సూర్య కొత్త సినిమా టైటిల్ ఇదే

Suriya's New movie - సూర్య కొత్త సినిమాకు కంగువ అనే టైటిల్ పెట్టారు. ఇంతకీ దీని అర్థం ఏంటి?

Kanguva - సూర్య కొత్త సినిమా టైటిల్ ఇదే
X

ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూర్య సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు.

స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'కంగువ' అనే టైటిల్‌ను ప్రకటించింది. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. 3డిలో 10 భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషలకు ‘కంగువ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ప్రకటించారు.

ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నైతో పాటు పలు లొకేషన్లలో జరుగుతోంది. ఇప్ప‌టికే 50 శాతం పూర్త‌య్యింది. మ‌రో నెల‌లో బ్యాల‌న్స్ షూటింగ్ పూర్తి చేయ‌నున్నారు.

యాక్షన్ సన్నివేశాలు, భారీ విఎఫ్ఎక్స్, 3డీ వర్క్ ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  17 April 2023 8:08 AM IST
Next Story