Sundeep Kishan: మైఖేల్ విడుదల తేదీ ఫిక్స్
Michael Movie: సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా మూవీ మైఖేల్. ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు.
BY Telugu Global4 Jan 2023 9:37 AM IST

X
Telugu Global Updated On: 4 Jan 2023 9:37 AM IST
సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ ఇప్పటికే మొదలైంది. సిద్ శ్రీరామ్ పాడిన పాటను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేశారు. సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ మేరకు కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. గౌతమ్ మీనన్ విలన్ గా కనిపిస్తున్నాడు.
దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Next Story