Sundeep Kishan | కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సందీప్
Sundeep Kishan - సందీప్ కిషన్ కొత్త సినిమా ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.
సందీప్ కిషన్, వీఐ ఆనంద్ రెండోసారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.
ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు మేకర్స్. ఊరు పేరు భైరవకోన ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన స్టిల్ క్యూరియాసిటీని పెంచింది. 2 నెలల్లో సినిమా రాబోతుంది కాబట్టి మేకర్స్ త్వరలో ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేయబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఊరు పేరు భైరవకోనలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా అనే 2 పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్.