Sundeep Kishan | సందీప్ కిషన్ కొత్త సినిమా వచ్చేస్తోంది
Sundeep Kishan - సందీప్ కిషన్ తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. ఇదొక ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.
ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచింది.
ఊరు పేరు భైరవకోనలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సినీ ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే హిట్టయ్యాయి.
వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైఖేల్ తర్వాత సందీప్ కిషన్ నుంచి వస్తున్న సినిమా ఇదే.