Telugu Global
Cinema & Entertainment

సహజీవనంపై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో సుమంత్. చచ్చేంత వరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ సహజీవనం చేయాల్సి వస్తే అది వేరే విధంగా ఉంటుందని తెలిపాడు

Sumanth
X

హీరో సుమంత్ మరోసారి తన వైవాహిక జీవితంపై క్లారిటీ ఇచ్చాడు. తనకు మరోసారి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తుది శ్వాస వరకు సింగిల్ గానే ఉంటానని ప్రకటించాడు.

"పెళ్లి విషయంలో నేను స్టీరియోటైపుగా లేను. చచ్చేంత వరకు పెళ్లి చేసుకోను. ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదు. గతంలో ఓసారి పెళ్లి చేసుకున్నాను. కానీ నన్ను నేను పెళ్లయిన వ్యక్తిగా భావించడం లేదు. నేను ఎప్పటికీ సింగిల్ గానే ఉంటాను."

గతంలో హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లాడాడు సుమంత్. కానీ వాళ్ల వైవాహిక జీవితం ఎక్కువ రోజులు సాగలేదు. విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాలాసార్లు సుమంత్ పెళ్లిపై పుకార్లు వచ్చాయి. ఆమధ్య 'మళ్లీ మొదలైంది' అనే సినిమా రిలీజ్ టైమ్ లో కూడా పుకార్లు వచ్చాయి. ఈసారి మాత్రం గట్టిగా ఖండించాడు ఈ హీరో.

సహజీవనంపై కూడా తనకు పెద్దగా ఆసక్తి లేదని, ఒకవేళ మరో వ్యక్తితో కలిసుండాల్సి వస్తే వేర్వేరు ఇళ్లలోనే కలిసి ఉంటాం తప్ప, నా సొంతింట్లో కలిసి ఉండే ప్రసక్తి లేదని సుమంత్ స్పష్టం చేశాడు. రాబోయే రోజుల్లో ఎవరైనా తనకు దగ్గరైతే, ఆమెతో విడిగా కలిసుంటానని, అప్పుడప్పుడు కలుస్తానని అంటున్నాడు.

First Published:  15 Oct 2022 2:15 PM IST
Next Story