Telugu Global
Cinema & Entertainment

Sriranga Neethulu | సుహాస్ నుంచి వచ్చే సినిమా ఇదే

Sriranga Neethulu - సుహాస్ తాజా చిత్రం శ్రీరంగనీతులు. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ నిర్ణయించారు.

Sriranga Neethulu | సుహాస్ నుంచి వచ్చే సినిమా ఇదే
X

రీసెంట్ గా ప్రసన్నవదనం అనే సినిమా టీజర్ ను విడుదల చేశాడు సుహాస్. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా తర్వాత సుహాస్ నుంచి వచ్చే సినిమా ఇదేనని అంతా అనుకున్నారు. కానీ సుహాస్ నుంచి వచ్చే తదుపరి చిత్రం శ్రీరంగ నీతులు. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌ పాత్రలు పోషిస్తున్న సినిమా శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

యువ‌త‌రం భావోద్వేగాల‌తో, సినిమాలోని పాత్ర‌ల‌తో త‌మ‌ను తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా, మ‌న‌సుకు హ‌త్తుకునే స‌న్నివేశాల‌తో ఈ సినిమా తెరకెక్కిందంటున్నాడు దర్శకుడు.

అజ‌య్ అర‌సాడ, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుందంట. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన చిత్ర‌మిదని చెబుతున్నారు నిర్మాత వెంకటేశ్వరరావు.

చాలామంది ఈ సినిమాను ఆంథాలజీ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది ఆంథాలజీ మూవీ కాదని, ఒకే టైమ్ లైన్ లో జరుగుతూ, పాత్రల మధ్య కనెక్షన్ తో సాగే ఎమోషనల్ స్టోరీ అని చెబుతున్నారు మేకర్స్.

First Published:  9 March 2024 10:18 AM IST
Next Story