Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu: కృష్ణ నుంచి ఫస్ట్ కాల్ మిస్ అవుతున్నాను

Sudheer Babu Krishna - కృష్ణ లేని లోటు పూడ్చలేనిదని అంటున్నాడు ఆయన అల్లుడు, నటుడు సుధీర్ బాబు. తన మామ కృష్ణతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు.

Sudheer Babu: కృష్ణ నుంచి ఫస్ట్ కాల్ మిస్ అవుతున్నాను
X

హీరో సుధీర్ బాబు తన మామ సూపర్ స్టార్ కృష్ణను మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన సినిమా ఏది రిలీజైనా మొదటి రోజు మొదట ఆట పూర్తయిన తర్వాత కృష్ణ నుంచి ఫోన్ కాల్ వస్తుందని, ఈసారి ఆ కాల్ ను మిస్ అవుతున్నానంటూ బాధపడ్డాడు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

"కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత విడుదల అవుతున్న నా తొలి సినిమా 'హంట్'. ఇది నా తొలి ప్రెస్ మీట్. ఆయన లేకపోవడం నాకు వెలితి. సినిమా విడుదలయ్యాక మార్నింగ్ షో తర్వాత కృష్ణ గారి నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్ అవుతా. నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు 'వెళ్లనివ్వాలా వద్దా' అని ఇంట్లో అందరికి కన్‌ఫ్యూజన్. కొందరు ముఖం మీద చెప్పేశారు. కృష్ణ గారు ఒక్క మాట అన్నారు... 'కష్టపడితే సక్సెస్ అవుతాడు. చెయ్యనివ్వండి' అని! అప్పటి నుంచి నా లైఫ్ టర్న్ తీసుకుంది."

ఇలా కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు సుధీర్ బాబు. కృష్ణ మరణించానికి 20 రోజుల ముందు ఏమైనా సినిమాలు చూస్తారా అని అడిగాడట సుధీర్ బాబు. కేవలం మహేష్, సుధీర్ బాబు సినిమాలు మాత్రమే చూస్తానని కృష్ణ చెప్పారట. ఆయన అలా చెప్పడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందన్నాడు సుధీర్ బాబు.

హంట్ సినిమా కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదని, ఇదొక ప్రయోగమని అంటున్నాడు సుధీర్ బాబు. ఏ హీరో ఇలాంటి సబ్జెక్ట్ చేయడని, తను మాత్రం ధైర్యం చేసి నటించానని అన్నాడు.

First Published:  24 Jan 2023 10:52 PM IST
Next Story