Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu: సుధీర్ బాబు పాన్ ఇండియా సినిమా టైటిల్ ఇదే

Sudheer Babu: సుధీర్ బాబు పాన్ ఇండియా సినిమా టైటిల్ ఇదే. దీనికీ హరోం హర అనే టైటిల్ ఖరారు చేసారు

Sudheer Babu: సుధీర్ బాబు పాన్ ఇండియా సినిమా టైటిల్ ఇదే
X

సుధీర్ బాబు, జ్ఞానసాగర్ కాంబోలో సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. సెహరితో దర్శకుడిగా ఆకట్టుకున్న జ్ఞానసాగర్, తన రెండో సినిమా కోసం భారీ కాన్వాస్‌ తో కూడిన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. ఎస్‌ ఎస్‌ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


"అక్టోబర్ 31న మాస్ సంభవం" అని ఇటీవల ప్రకటించిన నిర్మాతలు.. బిగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ చిత్రానికి 'హ‌రోం హ‌ర‌' అనే పవర్ ఫుల్ టైటిల్‌ ను లాక్ చేశారు. ది రివోల్ట్ అనే ట్యాగ్ లైన్ కూడా వుంది. టైటిల్ ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, ప్రతీకార కోణం కూడా ఉందనే విషయం ట్యాగ్ లైన్ చూస్తే అర్థమౌతుంది.


చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు వీడియోలో చూపించారు. ఈ వీడియో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబుని ప్రజంట్ చేసింది. "ఇంగా సెప్పేదేం లేదు... సేసేదే..." అని సుధీర్ బాబును చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.


'హరోం హర' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.

First Published:  31 Oct 2022 5:01 PM IST
Next Story