Telugu Global
Cinema & Entertainment

MAX Movie | సుదీప్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా

MAX Movie - సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మ్యాక్స్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి టీజర్ వచ్చింది.

MAX Movie | సుదీప్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా
X

కన్నడ స్టార్ హీరో, బాద్‌షా కిచ్చా సుదీప్ నటించిన సినిమా ‘మాక్స్’. ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. యాక్షన్ జానర్‌ ఇష్టపడేవాళ్లకు మాక్స్ సినిమా విజువల్ ఫీస్ట్ అంటున్నారు మేకర్స్.

మాక్స్ పాన్-ఇండియన్ సినిమాగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాక్స్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కిచ్చా సుదీప్ చాలా కాలం తరువాత మళ్లీ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌లో అతని లుక్ ఆకట్టుకుంది.

విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, ప్రమోద్ శెట్టి తదతరులు నటించారు. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టీజర్ కు మరింత అందం తెచ్చిపెట్టింది. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి థాను, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై కిచ్చా సుదీప్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

First Published:  16 July 2024 4:42 PM GMT
Next Story