Telugu Global
Cinema & Entertainment

Ramabanam - టైటిల్ వెనక కథ బయటపెట్టిన నిర్మాత

Story behind Ramabanam Title - రామబాణం టైటిల్ వెనక ఓ పెద్ద కథ ఉంది. ఈ టైటిల్ వెనక బాలయ్య ఉన్నాడు.

Ramabanam - టైటిల్ వెనక కథ బయటపెట్టిన నిర్మాత
X

గోపీచంద్ సినిమా పేరు రామబాణం. నిజానికి ఇలాంటి టైటిల్ పెడతారని ఎవ్వరూ ఊహించలేదు. లక్ష్యం, లౌక్యం తరహాలో మరో టైటిల్ పెడతారని అనుకున్నారు. కానీ రామబాణం ఫిక్స్ అయింది. ఇంతకీ ఈ టైటిల్ ఎవరు పెట్టారు? దీని వెనక కథేంటి?

రామబాణం టైటిల్ ను యూనిట్ పెట్టలేదు. ఓ సందర్భంలో బాలకృష్ణ ఈ సినిమా కథ విని ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. అప్పటికే ఎన్నో టైటిల్స్ అనుకున్నప్పటికీ, బాలయ్య చెప్పడంతో రామబాణం టైటిల్ కు ఫిక్స్ అయిపోయారు. పైగా ఇది అన్నదమ్ముల కథ కావడం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో టైటిల్ కు ఫిక్స్ అయిపోయారు.

అలా రామబాణం టైటిల్ పెట్టాల్సి వచ్చిందని తెలిపింది యూనిట్. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కు ఏడాది టైమ్ పట్టింది. అయితే ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందంటున్నారు.

మే5న థియేటర్లలోకి వస్తోంది రామబాణం సినిమా. సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా, కీలక పాత్రల్లో జగపతిబాబు, ఖుష్బూ కనిపించనున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరక్టర్.

First Published:  18 April 2023 2:39 AM GMT
Next Story