Srinivas Avasarala - తన సినిమా కథ చెప్పిన అవసరాల
Phalana Abbayi Phalana Ammayi - ఈ సినిమా స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని దర్శకుడు అవసరాల శ్రీనివాస్ బయటపెట్టాడు.
అవసరాల శ్రీనివాస్ కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి దర్శకుడు కూడా. జ్యో అచ్యుతానంద, ఊహలు గుసగుసలాడే లాంటి 2 మంచి సినిమాలు తీశాడు. ఇప్పుడు నాగశౌర్య హీరోగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమా తీస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, 'కనుల చాటు మేఘమా' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మీడియాతో మాట్లాడాడు. లైట్ గా స్టోరీలైన్ బయటపెట్టాడు.
"ఈ సినిమాలో 7 చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ నిడివి సుమారుగా 20 నిమిషాలు ఉంటుంది. ఈ 7 చాప్టర్లు పదేళ్ల వ్యవధిలో జరుగుతాయి. ఈ పదేళ్లలో 18 నుంచి 28 ఏళ్ళ వరకు నాగశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా పట్ల శౌర్య చాలా నమ్మకంగా ఉన్నాడు."
ఇలా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా స్టోరీలైన్ బయటపెట్టాడు అవసరాల శ్రీనివాస్. సాధారణంగా తను ఏ కథ రాసినా కనీసం ఏడాది టైమ్ తీసుకుంటానని, ఈ సినిమా కథ రాయడానికి మాత్రం తనకు ఏడాదిన్నరకు పైగా టైమ్ పట్టిందని వెల్లడించాడు ఈ సెన్సిబుల్ డైరక్టర్.