Srikanth Addala | నేను కాపు.. కానీ పెదకాపుతో సంబంధం లేదు
Srikanth Addala - పెదకాపు అనే పదం, ఓ సామాజిక వర్గానికి చెందిన పదం కాదంటున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ పదానికి అసలైన అర్థాన్ని వివరిస్తున్నాడు.
పెదకాపు.. ఈ టైటిల్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసారి కులాల్ని బేస్ చేసుకొని సినిమా తీస్తున్నాడని అపోహ పడుతున్నారు. అయితే నిజానికి పెదకాపు అనేది ఓ కులం కాదు. అదొక హోదా. ఈ విషయాన్ని బయటపెట్టాడు అడ్డాల.
"నేను కాపు కమ్యూనిటీ నుంచి వచ్చాను. అందుకే పెదకాపు అనే టైటిల్ పెట్టినట్టు చాలామంది భ్రమపడుతున్నారు. నిజానికి పెదకాపు అంటే కులం కాదు, అదో హోదా. ఊరిలో పెద్ద మనిషిని పెదకాపు అంటారు. నలుగురికి మంచి చేసే వ్యక్తిని పెదకాపు అంటారు. ఈ సినిమాలో పాత్రను అంతా అలానే పిలుస్తారు."
ఇలా పెదకాపు టైటిల్ వెనక సీక్రెట్ ను బయటపెట్టాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో పెద్ద మనుషుల్ని ఇలానే సంబోధిస్తారని, ఉత్తరాంధ్రలో పెద్ద మనుషుల్ని బుగత అంటారని చెప్పుకొచ్చాడు అడ్డాల.
మరి నైజాం, రాయలసీమ లాంటి ప్రాంతవాసలకు ఈ మేటర్ ఎలా అర్థమౌతుందనే ప్రశ్నకు కూడా శ్రీకాంత్ అడ్డాల దగ్గర సమాధానం ఉంది. సినిమా చూసిన తర్వాత వాళ్లంతా ఈ పదానికి అర్థం తెలుసుకుంటారని అంటున్నాడు.
విరాట్ కర్ణ హీరోగా పరిచయమౌతున్న సినిమా పెదకాపు-1. అనసూయ, రావురమేష్ ఇఁదులో కీలక పాత్రలు పోషించారు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం ట్రయిలర్ పెద్ద హిట్టవ్వడమే.