Telugu Global
Cinema & Entertainment

'విశ్వంభర' సెట్‌ శ్రీలీల సందడి

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీలీలకు మెగాస్టార్‌ స్పెషల్‌ గిఫ్ట్‌

విశ్వంభర సెట్‌ శ్రీలీల సందడి
X

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా మూవీ 'విశ్వంభర'. ఈ సినిమా సెట్‌లో నటి శ్రీలీల సందడి చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరు ఆమెను సత్కరించారు. వెండి వర్ణంలో ఉన్న శంఖాన్ని ప్రత్యేక కానుకగా అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీలీల తాజాగా ఇన్‌స్టా స్టోరిస్‌ వేదికగా కొన్ని ఫొటోలు పంచుకున్నారు. 'విత్‌ ఓజీ.. వెండితెర వేదికగా మనమెంతో ఆదరించే మన శంకర్‌దాదా ఎంబీబీఎస్‌. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కానుక. మీ విషెస్‌కు ధన్యవాదాలు. రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు థాంక్స్‌ అని రాసుకొచ్చారు.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న 'విశ్వంభర'లో త్రిష హీరోయిన్‌. వశిష్ట డైరెక్షన్‌ చేస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ కీ రోల్‌ పోషిస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే,, అత్యున్నత సాంకేతి పరిజ్ఞానంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో 'విశ్వంభర'ను తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. యు.వి. క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రమిది. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ప్రొడ్యూసర్స్‌. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా సెట్‌లో శ్రీల కనిపించడంతో ఆమె ఇందులో నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

First Published:  9 March 2025 4:44 PM IST
Next Story