Telugu Global
Cinema & Entertainment

SreeLeela: రోజూ దేవుడికి థ్యాంక్స్ చెబుతా

SreeLeela: తొలి సినిమాకే భారీ స్థాయిలో స్టార్ డమ్ తెచ్చుకోవడంపై శ్రీలీల స్పందించింది. అంతా దేవుడి దయ అంటున్న ఈ బ్యూటీ, ప్రతి రోజూ దేవుడికి థ్యాంక్స్ చెబుతానని అంటోంది.

SreeLeela: రోజూ దేవుడికి థ్యాంక్స్ చెబుతా
X

తన రెండో సినిమాతో థియేటర్లలోకి వచ్చింది శ్రీలీల. పెళ్లిసందడితో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ధమాకాతో మరోసారి థియేటర్లలోకి వచ్చింది. మొదటి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ సుందరి, ప్రతి రోజూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అంటోంది.

"గ్రేట్ ఫుల్ ఫీలింగ్. రాఘవేంద్ర రావు గారి సినిమాతో లాంచ్ కావడం తర్వాత రవితేజతో ధమాకా లాంటి బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా ఉంది. రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా రవితేజ లాంటి స్టార్ హీరో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. మొదట్లో మాట్లాడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఆయనతో పని చేస్తుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. రవితేజ గారు చాలా మోటివేట్ చేస్తారు. ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్ ఉంటుంది. సెట్ లో చాలా సపోర్ట్ చేస్తారు."

ధమాకా కంటే ముందే రవితేజకు తను పెద్ద అభిమానినని అంటోంది శ్రీలీల. కిక్, విక్రమార్కుడు సినిమాల్ని లెక్కలేనన్ని సార్లు చూశానని చెబుతున్న ఈ చిన్నది.. పాత్రలో వేరియేషన్స్ ని రవితేజ చాలా ఈజీగా చూపించగలరని అంటోంది.

First Published:  23 Dec 2022 8:18 PM IST
Next Story