Telugu Global
Cinema & Entertainment

SreeLeela | లేడీ బాస్ గా మారిన శ్రీలీల

SreeLeela - రాబిన్ హుడ్ మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

SreeLeela | లేడీ బాస్ గా మారిన శ్రీలీల
X

హీరో నితిన్ కొత్త సినిమా 'రాబిన్‌హుడ్‌'. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఆమె పాత్రను లేడీ బాస్ నీరా వాసుదేవ్‌గా పరిచయం చేశారు.

శ్రీలీల తన చుట్టూ టైట్ సెక్యురిటీతో ప్రైవేట్ జెట్‌లో దిగినట్లు వీడియోలో చూపించారు. సినిమాలో ఆమె పొగురుబోతు పాత్రలో కనిపించనుంది. టీజర్‌లో “జ్యోతీ, సునామీలో టి సైలెంట్‌ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి' అని శ్రీలీల చెప్పిన డైలాగ్ అలరించింది.

మూవీలో శ్రీలీల పాత్ర, నితిన్ పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నితిన్, శ్రీలీల పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్ కేర్ తీసుకున్నాడు. విజువల్స్ గ్రాండ్‌గా అనిపించాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తారు.

First Published:  14 Jun 2024 5:42 PM GMT
Next Story