Telugu Global
Cinema & Entertainment

Swag Movie | శ్రీవిష్ణు సరసన ముగ్గురు హీరోయిన్లు

SWAG movie - శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సినిమా శ్వాగ్. ఈ సినిమాలో హీరోయిన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Swag Movie | శ్రీవిష్ణు సరసన ముగ్గురు హీరోయిన్లు
X

శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా శ్వాగ్. ఈ సినిమా నుంచి ఇప్పటికే వింజమర మహారాణి రుక్మిణి దేవి పాత్రలో రీతూ వర్మను పరిచయం చేశారు. ఆ తర్వాత ఎవర్‌గ్రీన్ బ్యూటీ మీరా జాస్మిన్‌ను ఉత్ఫల దేవిగా పరిచయం చేశారు. ఆమె రాణి కావాల్సింది. కానీ ఆమె తన గుణాల కారణంగా సింహాసనాన్ని కోల్పోయినట్టు చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ముచ్చటగా మరో హీరోయిన్ ను కూడా పరిచయం చేశారు. శ్వాగ్ సినిమాలో దక్ష నగార్కర్ కూడా ఉంది. ఆమె లుక్ ను కూడా రివీల్ చేశారు. మరో యువరాణిగా దక్షను పరిచయం చేశారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ల సంఖ్య మూడుకు చేరింది.

శ్రీవిష్ణు సినిమాలో ఇలా ముగ్గురు హీరోయిన్లు ఉండడం ఇదే తొలిసారి. అయితే ముగ్గురితో ఆగుతుందా, ఇంకా హీరోయిన్లను పరిచయం చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఔట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబోలో వస్తోంది ఈ మూవీ.

ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి రాజరాజ చోర సినిమా చేశారు. ఆ మూవీని కూడా టీజీ విశ్వప్రసాదే నిర్మించారు. ఆ సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగరే, ఈ కొత్త సినిమా శ్వాగ్ కు కూడా సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 Jun 2024 4:21 PM GMT
Next Story