Samajavaragamana - శ్రీవిష్ణు సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే..?
Sree Vishnu's Samajavaragamana - ఈసారి కామెడీ ఎంటర్ టైనర్ తో మనముందుకొస్తున్నాడు శ్రీవిష్ణు. సామజవరగమన ట్రయిలర్ రిలీజైంది.
హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా సిద్ధమైంది. ఈసారి కామెడీ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. దీని పేరు సామజవరగమన. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ ట్రయిలర్ ఎలా ఉందంటే..
ట్రైలర్‌లో చూస్తే, శ్రీవిష్ణు ఒక మల్టీప్లెక్స్‌లో పనిచేసే సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించాడు. అతడ్ని బాక్సాఫీస్ బాలు అని పిలుస్తారు. అమ్మాయిలంటే ఇతగాడికి పడదు, అందుకే అందరితో రాఖీలు కట్టించుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో, అతను రెబా మోనికా జాన్‌ను కలుస్తాడు. శ్రీవిష్ణును ప్రేమిస్తుందామె.
రామ్ అబ్బరాజు మధ్యతరగతి కుటుంబాల కష్టాలను ఫన్నీగా చూపిస్తూ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా సామజవరగమన చిత్రాన్ని రూపొందించాడు. ట్రయిలర్ లో శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ బాగుంది. హాస్యనటులు వెన్నెల కిషోర్, నరేష్, సుదర్శన్ లాంటి చాలామంది ట్రయిలర్ లో కనిపించారు.
శ్రీవిష్ణు ప్రేమికురాలిగా రెబా మోనికా జాన్ చాలా అందంగా కనిపించింది. గోపీ సుందర్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కామెడీ భాగాన్ని మరింత ఎలివేట్ చేశాడు.
అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.