ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన శ్రీవిష్ణు
హీరో శ్రీవిష్ణు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. ఓ హీరో ఆడియన్స్ కు ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది.. మీరే చదవండి..
హీరో శ్రీవిష్ణు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. అల్లూరి సినిమాకు సంబంధించి ఇలా సారీ చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు సంబంధించి మార్నింగ్ షోలు కాన్సిల్ అయ్యాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇలా జరిగింది. దీంతో టికెట్ తీసుకొని థియేటర్ కు వెళ్లిన చాలామంది ఇబ్బంది పడ్డారు. శ్రీవిష్ణు ట్యాగ్ చేస్తూ పోస్టులు కూడా పెట్టారు.
ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన శ్రీవిష్ణు, ప్రేక్షకులకు సారీ చెప్పాడు. సాంకేతిక కారణాల వల్ల మాత్రమే మార్నింగ్ షోలు పడలేదంటున్నాడు ఈ నటుడు.
"అల్లూరి సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో కుదరలేదు. దానికి ప్రేక్షకులకు క్షమాపణలు. పోలీస్ ఆఫీసర్ కథని ఒక బయోపిక్ లా కీలకమైన సంఘటనలతో సిన్సియర్ గా ప్రజంట్ చేశాం. ప్రేక్షకుల నుండి కూడా అంతే సిన్సియర్ గా రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీన్స్ కి విజల్స్ వేస్తున్నారు. నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం నాకే కొత్త అనుభూతిని ఇచ్చింది"
ఇలా క్షమాపణలు చెబుతూనే, తన సినిమాకు ఎలివేషన్లు ఇచ్చుకున్నాడు శ్రీవిష్ణు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ కు ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారని, అదే తమ విజయమని అంటున్నాడు ఈ హీరో.