Telugu Global
Cinema & Entertainment

Sree Vishnu | ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్

Sree Vishnu - హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించడానికి సిద్ధమైంది.

Sree Vishnu | ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్
X

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించడానికి సిద్ధమైంది.వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఓం భీమ్ బుష్' రేపు విడుదల కానున్న నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడాడు.

"ఇందులో చాలా కొత్త పాయింట్, ఐడియా చెప్పడం జరిగింది. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్. చాలా సార్లు కొత్త పాయింట్ దొరికినప్పుడు ఒకటే జోనర్ కి కట్టుబడి ఉండిపోతాం. అలా ఒకటే జోనర్ కి పరిమితం కాకుండా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తూ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా చేశాం. కచ్చితంగా అందరూ ఎంటర్ టైన్ అవుతారు. మేము చెప్పే కొత్త పాయింట్ రివిల్ అయినపుడు ఆడియన్స్ తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. ఆ సమయానికి కథలో మా పాత్రల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సినిమా చూస్తున్న ఆడియన్స్ మాత్రం హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు."

సినిమాకు టైటిల్ పెట్టే అంశంపై కూడా స్పందించాడు శ్రీవిష్ణు. 2-3 టైటిల్స్ అనుకున్నప్పటికీ.. తనకు మాత్రం ఓం భీష్ బుష్ అనే టైటిలే బాగా నచ్చిందన్నాడు.

"రెండు, మూడు టైటిల్స్ అనుకున్నాం. అందులో ఒకటి ఇంగ్లీష్ లో వస్తుంది. అయితే నేను మాత్రం 'ఓం భీమ్ బుష్' వైపే ఉన్నాను. ఇది చాలా క్యాచి టైటిల్. చిన్నప్పుడు మనం మ్యాజిక్కులు చేయడానికి వాడే మంత్రం ఇదే. నిర్మాత వంశీ గారు ఫస్ట్ కట్ చూసి 'ఓం భీమ్ బుష్' పేరే ఫిక్స్ అయిపోదాం అన్నారు. అలా 'ఓం భీమ్ బుష్'నే ఫైనల్ చేశాం. టైటిల్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టైటిల్స్ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను. సినిమాని ముందు ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళేది అదే కదా."

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. రన్ టైమ్ కూడా గ్రిప్పింగ్ గా ఉంది.

First Published:  21 March 2024 9:54 AM IST
Next Story