Sree Leela - పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల
Sree Leela Pawan Kalyan - పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది శ్రీలీల. ఆ డీటెయిల్స్ మీకోసం..
![Sree Leela - పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల Sree Leela - పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల](https://www.teluguglobal.com/h-upload/2023/02/28/724812-pawan-sreeleela.webp)
హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల మరో బంపరాఫర్ కొట్టేసింది. ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటుంది ఈ బ్యూటీ.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు పవన్ కల్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలోనే పవన్ సరసన హీరోయిన్ గా నటించనుంది శ్రీలీల.
నిజానికి ఈ ప్రాజెక్టులో పవన్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నాడు దర్శకుడు. ఎందుకంటే, హరీశ్ కు పూజాహెగ్డే అంటే సెంటిమెంట్. అయితే పూజా మాత్రం కాల్షీట్లు కేటాయించలేకపోయింది. దీంతో శ్రీలీలకు అవకాశం దక్కింది.
తాజాగా ధమాగా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. పవన్ సినిమాతో ఆమె టాప్ హీరోయిన్ రేసులోకి ఎంటరైంది.