Mahesh Babu, Sree Leela: మహేష్ సరసన శ్రీలీల
Mahesh Babu, Sree Leela Movie హీరోయిన్ శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఏకంగా మహేష్ సరసన నటించే అవకాశం అందుకుంది.

ముద్దుగుమ్మ శ్రీలీల మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుంది ఈ బ్యూటీ. అవును.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.
మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను కన్ ఫర్మ్ చేశారు. రెండో హీరోయిన్ గా చాలామంది పేర్లు తెరపైకొచ్చాయి. ఓ దశలో సంయుక్త మీనన్ ఫిక్స్ అనుకున్నారంతా. కానీ శ్రీలీల ను కన్ ఫర్మ్ చేశారు. త్వరలోనే ఆమె సెట్స్ లో జాయిన్ అవుతుంది.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజను సినిమాలున్నాయి. రామ్, వైష్ణవ్ తేజ్, రవితేజ, నవీన్ పొలిశెట్టి, బాలకృష్ణ... ఇలా చాలామంది హీరోల సరసన ఆమె నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సినిమా ఛాన్స్ అందుకుంది.
డిసెంబర్ 2 నుంచి మహేష్-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఇంతకుముందు అనుకున్న కథ కాకుండా, పూర్తిగా కొత్త కథతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ లో ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేస్తారు.