Telugu Global
Cinema & Entertainment

మరో 2 రోజుల్లో సీతారామం స్ట్రీమింగ్

దుల్కర్, మృణాల్ నటించిన సీతారామం సినిమా థియేటర్లలో సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఆ డీటెయిల్స్ మీకోసం..

మరో 2 రోజుల్లో సీతారామం స్ట్రీమింగ్
X

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అద్భుతమైన ప్రశంసలు తో పాటు, బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ వచ్చాయి. ఆగష్టు 5న రిలీజైన ఈ చిత్రానికి ఇప్పటికి మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో స్టడీగా ఆక్యుపెన్సీ ఉంది.

ఇలాంటి టైమ్ లో మేకర్స్ ఎవరైనా తమ ఓటీటీ విడుదల కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటారు. పైగా మొన్ననే సీతారామం హిందీ వెర్షన్ కూడా రిలీజైంది. ఓవైపు ఇంత వ్యవహారం నడుస్తుంటే, మరోవైపు మేకర్స్ మాత్రం ఓటీటీ విడుదలకు మొగ్గుచూపుతున్నారు. మరో 2 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 9న ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ఇలా ఓవైపు థియేట్రికల్ రన్ నడుస్తున్నప్పటికీ, మరోవైపు ఓటీటీకి సినిమాను ఇచ్చేయడానికి రీజన్ ఒకటే. అమెజాన్ రూల్స్ ప్రకారం, నిర్ణీత గడువులో సినిమాను స్ట్రీమింగ్ కు పెడితే, గంట స్ట్రీమింగ్ కు వచ్చే రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం థియేటర్లలో వస్తున్న ఎమౌంట్ కంటే, అమెజాన్ నుంచి రాబోయే మొత్తం ఎక్కువ. అందుకే మరో ఆలోచన లేకుండా రిలీజైన నెల రోజులకే సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం, ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది.

First Published:  7 Sept 2022 5:55 PM IST
Next Story