Telugu Global
Cinema & Entertainment

ఆయన లేరు.. రాసిన పాటలు మాత్రం వస్తున్నాయి

సీతారామం సినిమా నుంచి మరో సాంగ్ రిలీజైంది. ఈ పాటకు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

Sita Ramam Movie
X

సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఈ సరస్వతీ పుత్రుడు ఈ లోకాన్ని వీడి చాలా రోజులైంది. అయినప్పటికీ ఆయన రాసిన పాటలు మాత్రం ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. సిరివెన్నెల అస్తమించిన తర్వాతే శ్యామ్ సింగరాయ్ నుంచి ఆయన రాసిన పాట రిలీజైంది. ఆ తర్వాత పక్కా కమర్షియల్ సినిమా నుంచి కూడా సిరివెన్నెల రాసిన పాట విడుదలైంది. ఇప్పుడు ఆయన రాసిన మరో పాట కూడా రిలీజైంది. సీతారామం సినిమాలో ఆ పాట ఉంది.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని థర్డ్ సింగల్ 'కానున్న కళ్యాణం' పాటని విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, తరుణ్ భాస్కర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ పాటకు వేదికపై దుల్కర్ సల్మాన్. మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని అలరించింది.

మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సింధూరి ఈ పాటని ఆలపించిన విధానం బాగుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా ఉంది.

కానున్న కళ్యాణం ఏమన్నది.. స్వయంవరం మనోహరం.. అనే లిరిక్స్ తో సాగే ఈ సాహిత్యం వినడానికి ఇంపుగా ఉంది. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


First Published:  19 July 2022 4:27 AM GMT
Next Story