మహిర శర్మతో సిరాజ్ డేటింగ్... క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్ ఫేమ్
నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. అభిమానులు మనకు ఎవరితో అయినా సంబంధాలు పెట్టగలరు అన్న మహిరా శర్మ

భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ ప్రేమ వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హిందీ బిగ్‌బాస్ ఫేమ్ మహిర శర్మ తో సిరాజ్ డేటింగ్‌లో ఉన్నాడంటూ కథనాలు వస్తున్నాయి. చాలా దగ్గరి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారని పలు ఇంగ్లీష్ సైట్లలో వచ్చింది. మహిరా చేసిన పోస్టుకు ఇన్‌స్టాగ్రామ్‌లో సిరాజ్ లైక్ కొట్టడంతో పాటు ఫాలో కావడం ఈ వార్తలకు బలం చేకూరినట్లు అందులో పేర్కొన్నాయి.
ఈ ఊహాగానాలపై తాగా మహిరా శర్మ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదు. నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. అభిమానులు మనకు ఎవరితో అయినా సంబంధాలు పెట్టగలరు. నేను పనిచేసిన సహ నటులతోనూ సంబంధాలు అంటగట్టారు. అటువంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను అని పేర్కొన్నారు.
1997 జమ్మూలో పుట్టిన మహిరా శర్మ కుటుంబం కొన్నేళ్ల కిందట ముంబయికి షిఫ్ట్ అయింది. దీంతో అక్కడి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసి.. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. హిందీ టీవీ సీరియల్స్, షోలతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బిగ్‌బాస్ 13తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్‌సిరీస్‌లతోనూ బిజిగా మారిపోయింది.