Siddu Jonnalagadda - వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ
Siddu Jonnalagadda - ఈసారి తన గొంతుతో మెస్మరైజ్ చేశాడు సిద్ధూ జొన్నలగడ్డ. భాగ్ సాలే సినిమా వరల్డ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు

డీజే టిల్లూతో అదరగొట్టాడు సిద్ధూ జొన్నలగడ్డ. అతడి యాక్టింగ్, మేనరిజమ్స్ కు జనాలు ఫిదా అయ్యారు. ఇప్పుడు తన గొంతుతో కూడా ఆకట్టుకున్నాడు ఈ హీరో.
శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి హీరోయిన్. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ ను చిత్రబృందం వెల్లడించింది. వరల్డ్ ఆఫ్ భాగ్ సాలేను ప్రేక్షకులకు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పరిచయం చేశాడు ఆయన వాయిస్ ఓవర్ తో భాగ్ సాలే చిత్ర నేపథ్యాన్ని వివరించారు. కథలో హీరో ఎందుకు ఛేజింగ్ చేస్తున్నాడు, దాని వెనకున్న కారణాలు సిద్ధు వాయిస్ లో ఆసక్తికరంగా చెప్పారు. భాగ్ సాలే ప్రపంచం ఎలా ఉండనుంది అనేది జూలై 7న థియేటర్స్ లో చూడాలని మూవీ టీమ్ కోరుతున్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తుంటాడు శ్రీసింహా. ఇందులో భాగంగానే భాగ్ సాలే సినిమాను అతడు సెలక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాతో గ్యారెంటీగా హిట్ కొడతానంటున్నాడు. కాలభైవర ఈ సినిమాకు సంగీతం అందించాడు.