Telugu Global
Cinema & Entertainment

Telusu Kada | సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో కదలిక

Telusu Kada - సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా 'తెలుసు కదా'. ఈ మూవీ రెగ్యులర్ షూట్ కు డేట్ ఫిక్స్ అయింది.

Telusu Kada | సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో కదలిక
X

టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ కు రెడీ అయ్యాడు. సినిమా పేరు 'తెలుసు కదా'. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆగస్ట్ 5 నుంచి ఏకథాటిగా 30 రోజుల పాటు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు నెల రోజుల కాల్షీట్లు కేటాయించాడు సిద్ధు.

ఈ సుదీర్ఘమైన షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌తో పాటు పాటలను కూడా చిత్రీకరిస్తారు. హైదరాబాద్‌లోనే 30 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్స్ వేశారు. హీరోయిన్లు రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతారు.

ఈ సినిమా కోసం సిద్దూ జొన్నలగడ్డ స్టైలిష్‌గా మేకోవర్ అవుతున్నాడు. వైవా హర్ష కీలక పాత్రలో నటించనున్నాడు అత్యంత భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  20 July 2024 5:20 PM GMT
Next Story