సినిమాల ముహూర్త సిద్ధాంతి సత్యనారాయణ కన్నుమూత
కొఠారు సత్యనారాయణ చౌదరికి రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సినీ క్రీడాంశాలపై జ్యోతిష్యాన్ని విశ్లేషకులుగా గుర్తింపు
BY Raju Asari2 Jan 2025 8:17 AM IST

X
Raju Asari Updated On: 2 Jan 2025 8:17 AM IST
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజు పాలెంకు చెందిన జ్యోతిష్య, వాస్తు పండితుడు, సినిమాల ముహూర్త సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ చౌదరి బుధవారం కన్నుమూశారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో కోలుకోలేకపోయారని డాక్టర్లు తెలిపినట్లు బంధువులు చెప్పారు. స్వగ్రామంలో గురువారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె నాగమణి ఉన్నారు. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సినీ క్రీడాంశాలపై జ్యోతిష్యాన్ని ఆయన విశ్లేషిస్తారు.
Next Story