Telugu Global
Cinema & Entertainment

Shruti Haasan | కేజీఎఫ్ స్టార్ సరసన శృతిహాసన్

Shruti Haasan - శృతిహాసన్ మరో క్రేజీ ప్రాజెక్టులోకి ఎంటరైంది. యష్ సినిమాలో కనిపించనుంది.

Shruti Haasan | కేజీఎఫ్ స్టార్ సరసన శృతిహాసన్
X

శృతి హాసన్ ఓ సినిమా అంగీకరించిందంటే, అది పెద్ద సినిమా అని అర్థం. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రాజెక్ట్ అని అర్థం. ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ “కూలీ”లో నటించనుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న “కూలీ” చిత్రంలో ఆమె రజనీకాంత్ కుమార్తెగా కనిపించనుంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న “సాలార్ 2”లో కూడా ఆమె మెయిన్ హీరోయిన్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ముద్దుగుమ్మ మరో పెద్ద సినిమాకు సైన్ చేసింది. కేజీఎఫ్ ఫేమ్ యష్ సరసన నటించనుంది శృతిహాసన్. తాజా సమాచారం ప్రకారం, యష్ సినిమాలో శృతిహాసన్ ఓ కీలక పాత్ర పోషించబోతోంది.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్' ఇందులో యష్ డాన్‌గా నటిస్తున్నాడు. ఇందులో యష్ సోదరిగా నయనతార, యష్ ప్రియురాలిగా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇందులో అత్యంత కీలకమైన మరో పాత్రలో శృతిహాసన్ కనిపించబోతోంది.

First Published:  25 July 2024 4:52 AM GMT
Next Story