హ్యాక్ గురైన శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా
రెండు వారాలైనా తన ఖాతా ఇంకా రికవరీ కాలేదని పేర్కొంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టిన సింగర్

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే. సుమారు రెండు వారాలైనా తన ఖాతా ఇంకా రికవరీ కాలేదని పేర్కొంటూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. తన ఎక్స్ ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్‌లను క్లిక్ చేయవద్దని అభిమానులకు సూచించారు.
ఫిబ్రవరి 13 తేదీ నుంచి నా ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైంది. దీనిపై ఎక్స్ బృందాన్ని సంప్రదించడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నించాను. ఆటో జనరేటెడ్ రెస్సాన్స్‌లను మించి ఎలాంటి స్పందన వారి నుంచి నాకు రాలేదు. ఖాతాను డిలీట్ చేయాలనుకున్నా అదీ వీలుపడటం లేదు. ఎందుకంటే లాగిన్ కావడానికి కూడా నాకు అవకాశం లేకుండాపోయింది. దయచేసి నా ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్‌లను క్లిక్ చేయవద్దు. అదే విధంగా అందులో వచ్చే మెసేజ్‌లను ఏ మాత్రం నమ్మవద్దు. అవన్నీ మోసపూరితమైనవి. నా ఎక్స్ ఖాతా రికవరీ అయిన వెంటనే నేనే ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేస్తూ.. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను అని ఆమె రాసుకొచ్చారు.