Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | ఒకే సింగర్ తో 6 వెర్షన్లు

Pushpa 2 Movie - ఈ సినిమా కోసం శ్రేయా ఘోషల్ ఓ సాంగ్ పాడారు. ఆ పాటను ఏకంగా 6 భాషల్లో ఆలపించారు.

Pushpa 2 | ఒకే సింగర్ తో 6 వెర్షన్లు
X

పుష్ప-2 మరో అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా నుంచి 2 రోజుల్లో మరో సాంగ్ రాబోతోంది. అది ఫిమేల్ ఓరియంటెండ్ సాంగ్ అనే సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోను స్వయంగా రష్మిక ఆవిష్కరించింది. ఇప్పుడీ సాంగ్ కు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది..

పుష్ప-2 నుంచి త్వరలోనే రాబోతున్న ఈ సెకెండ్ సింగిల్ ను శ్రేయా గోషల్ ఆలపించింది. మొత్తం 6 భాషల్లో ఈమెనే ఈ సాంగ్ ను పాడడం విశేషం. ఇలా ఒకే పాటను 5కు పైగా భాషల్లో పాడిన వ్యక్తిగా బాలసుబ్రమణ్యం, శంకర్ మహదేవన్ మాత్రమే చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఏ ఫిమేల్ సింగర్ కు ఈ అవకాశం రాలేదు.

తొలిసారి శ్రేయా ఘోషల్, ఒకే పాటను 6 భాషల్లో పాడి రికార్డ్ సృష్టించింది. ఈ పాటను ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ, బెంగాళీ భాషల్లో ఆలపించి రికార్డ్ క్రియేట్ చేశారు. 29వ తేదీన 11 గంటలకు ఈ పాటను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది పుష్ప-2 సినిమా. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు.

First Published:  27 May 2024 5:36 PM GMT
Next Story