Telugu Global
Cinema & Entertainment

తండేల్ నుంచి ‘శివ శక్తి’ పాట రిలీజ్

తండేల్ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు.

తండేల్ నుంచి ‘శివ శక్తి’ పాట రిలీజ్
X

యంగ్ హీరో నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న సినిమా ‘తండేల్‌’ చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాను. ఫిబ్రవరి 7న ఫ్యాన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి టీజర్, బుజ్జితల్లి పాట విడుదల చేయగా చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా తండేల్ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘నమో నమో నమః శివాయ..’ అంటూ సాగిన శివశక్తి పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటను జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావు రాయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో తెలుగులో అనురాగ్ కులకర్ణి, హరిప్రియ అద్భుతంగా పాడారు.

శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే పాటగా దీనిని తీర్చిదిద్దారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. నమో నమః శివాయ అంటూ సాగే ఈపాటను అనురాగ్‌ కులకర్ణి, హరిప్రియ దీనిని ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. తెలుగులో అనురాగ్ కులకర్ణి, హరిప్రియ అద్భుతంగా పాడారు. హిందీలో దివ్య కుమార్, సలోని థక్కర్ పాడగా.. తమిళ్ లో మహా లింగం, హరిప్రియ పాడారు. ఈ సాంగ్ ని తెలుగుతో పాటు తమిళ్, హిందీలో రిలీజ్ చేశారు.

First Published:  4 Jan 2025 9:35 PM IST
Next Story