Mahaveerudu Movie: మహావీరుడు ఆగస్ట్ లో వస్తున్నాడు
Mahaveerudu Movie release date: శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా మహావీరుడు. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Mahaveerudu Movie: మహావీరుడు ఆగస్ట్ లో వస్తున్నాడు
శివ కార్తికేయన్ కొత్త సినిమా మహావీరుడు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. పూర్తిగా ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కు జోడిగా అదితి శంకర్ (దర్శకుడు శంకర్ కూతురు) నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మహావీరుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అతడు నటించిన డాక్టర్ సినిమా టాలీవుడ్ లో కూడా హిట్టయింది. ఆ తర్వాత నేరుగా తెలుగులో ప్రిన్స్ అనే సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయినప్పటికీ, శివ కార్తికేయన్ కు టాలీవుడ్ లో బేస్ ఏర్పడింది.
మహావీరుడు సినిమా యూనివర్సల్ కంటెంట్ తో తెరకెక్కుతోందంటున్నాడు శివ కార్తికేయన్. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుందని చెబుతున్నాడు. భరత్ శంకర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.