Telugu Global
Cinema & Entertainment

Maname Movie | 'మనమే'లో మొత్తం 16 పాటలు

Sharwanand's Maname Movie - ఈమధ్య కాలంలో ఇన్ని పాటలతో ఓ సినిమా రాలేదు. మనమే మూవీలో 16 పాటలున్నాయి.

Maname Movie | మనమేలో మొత్తం 16 పాటలు
X

శర్వానంద్ హీరోగా నటిస్తున్న 35వ చిత్రం 'మనమే'. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సినిమాకు తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. యు'/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమా నిడివి 155 నిమిషాలుంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఆసక్తిరక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో మొత్తం 16 పాటలున్నాయి.

"స్కోరింగ్ మొదలుపెట్టినప్పుడు ఇన్ని పాటలు వస్తాయని మేం ఊహించలేదు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చాలా స్మార్ట్. ఆయన సినిమాని అద్భుతంగా మలిచి మంచి మ్యూజిక్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ కంపోజ్ చేసినప్పుడే దాదాపు 10 పాటలు వరకూ వచ్చాయి. సెకండ్ హాఫ్ కి మరో ఆరు పాటలు అవసరం అవుతాయని భావించాం. సినిమా కోసం16 పాటలు చేయడం నాకు ఇదే తొలిసారి.11 ప్రోపర్ సాంగ్ ట్రాక్స్. మరో 5 బిట్ సాంగ్స్ గా వస్తాయి."

ఇలా మనమే సినిమాలో మొత్తం 16 సాంగ్స్ ఉన్నాయనే విషయాన్ని మ్యూజిక్ డైరక్టర్ అబ్దుల్ హేషమ్ వహాబ్ ప్రకటించాడు. ఖుషి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ సంగీత దర్శకుడు, మనమే సినిమాకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడంట.

First Published:  5 Jun 2024 5:08 PM GMT
Next Story