Telugu Global
Cinema & Entertainment

Sharwanand: 26న నిశ్చితార్థం.. వేసవిలో పెళ్లి?

Sharwanand: శర్వానంద్ పెళ్లికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈనెల్లోనే ఈ హీరో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడట.

Sharwanand: 26న నిశ్చితార్థం.. వేసవిలో పెళ్లి?
X

హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడి పెళ్లి దాదాపు ఖరారైంది. ఈనెల 26న నిశ్చితార్థం కూడా ఏర్పాటుచేశారు. వేసవిలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజకీయ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తోంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో జాబ్ చేస్తోంది.

కొన్నాళ్లుగా శర్వానంద్ కు, ఈ అమ్మాయికి పరిచయం ఉంది. అదే టైమ్ లో ఇంట్లో వాళ్లకు కూడా నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు. అలా ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిగా మారింది.

తన ఎంగేజ్ మెంట్, పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా చూస్తున్నాడు శర్వానంద్. కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరుగుతుంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ కొట్టాడు శర్వానంద్. ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

First Published:  6 Jan 2023 9:48 AM IST
Next Story