Telugu Global
Cinema & Entertainment

నా హ్యాపీ డేస్ అవే - శర్వానంద్

తన జీవితంలో అత్యంత సంతోషంగా గడిపిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు హీరో శర్వానంద్. తనకు నిజంగా టైమ్ మెషీన్ దొరికితే అలాంటి జీవితంలోకి మళ్లీ వెళ్లిపోతానంటున్నాడు...

నా హ్యాపీ డేస్ అవే - శర్వానంద్
X

ప్రతి మనిషి జీవితంలో హ్యాపీ డేస్ ఉంటాయి. అలాంటివే శర్వానంద్ జీవితంలో కూడా ఉన్నాయి. అవే అతడి ఇంటర్మీడియట్ రోజులు. ఆ టైమ్ లో తను గడిపిన క్షణాల్ని మరిచిపోలేనంటున్నాడు ఈ హీరో. ఇప్పటికిప్పుడు తనకు టైమ్ మెషీన్ దొరికితే, ఇంటర్మీడియట్ రోజుల్లోకి వెళ్లిపోతానని అంటున్నాడు.

"నాకు టైమ్ మెషీన్ దొరికితే ఇంటర్ రోజులకి వెళ్తా. హ్యాపీ డేస్ అవి. రేపటి గురించి ఆలోచన, భవిష్యత్ గురించి బెంగ ఏమీ ఉండేవి కావు. కాలేజ్ బంక్ కొట్టాలి, సినిమాకి వెళ్ళాలి, అట్నుంచి దాబాకి వెళ్ళాలి. ఇదే ఆలోచన. నిజంగా గోల్డెన్ డేస్ అవి."

ఇలా తన గోల్డెన్ డేస్ ను గుర్తు చేసుకున్నాడు శర్వానంద్. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో ఒకే ఒక జీవితం అనే సినిమా చేశాడు శర్వానంద్. అందులో హీరో తన స్కూల్ డేస్ లోకి వెళ్లిపోతాడు. తల్లితో హ్యాపీగా గడుపుతాడు. నిజజీవితంలో మాత్రం శర్వానంద్, ఇంటర్మీడియట్ డేస్ లోకి వెళ్లాలని అనుకుంటున్నాడు.



First Published:  18 Sept 2022 12:50 PM IST
Next Story