Telugu Global
Cinema & Entertainment

Sharwanand - శర్వానంద్ పెళ్లి తేదీ ఫిక్స్

Sharwanand marriage - శర్వానంద్ పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. పెళ్లి జైపూర్ లో జరగనుంది.

Sharwanand - శర్వానంద్ పెళ్లి తేదీ ఫిక్స్
X

హీరో శర్వానంద్, ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. రక్షితతో అతడికి నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఇప్పుడు పెళ్లికి తేదీ లాక్ అయింది.

హీరో శర్వానంద్‌, రక్షితల వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. వివాహ ఆహ్వానం వెలువడింది. ఈ వివాహ వేడుక రెండు రోజులు పాటు వైభవంగా జరగనుంది. మెహందీ ఫంక్షన్ జూన్ 2 న జరుగుతుంది. మరుసటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్ జరుగుతుంది.

అదే రోజు జూన్3న జైపూర్‌ లోని లీలా ప్యాలెస్‌ లో శర్వానంద్‌, రక్షితల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుక రాత్రి 11 నుండి ప్రారంభమవుతుంది.

శర్వానంద్‌, రక్షితల నిశ్చితార్థం జనవరిలో జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలకు ఆహ్వానాలు అందాయి.

First Published:  17 May 2023 6:47 PM IST
Next Story